Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు.. దాదాపు 10 ఏళ్ల తర్వాత!

తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు.. దాదాపు 10 ఏళ్ల తర్వాత!

Telugu Samayam 1 week ago

టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు తిరుపత పెదకాపు లేఅవుట్‌లోని లోకనాథం ఇలంటితో పాటుగా బంధువల ఇళ్లలోనూ ఒకేసారి సోదాలు చేపట్టారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొత్తం 7 టీమ్‌లు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి అస్తుల ఆరోపణలతో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో లోకనాథంకు సంబంధించి గెస్ట్‌హౌస్, తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఏర్పేడు మండలం చెల్లూరులోని లోకనాథం సోదరుడి నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ సోదాల సమయంలో లోకనాథం ఇంట్లోనే ఉన్నారు.

లోకనాథం ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవోగా విధులను నిర్వహిస్తున్నారు. ఆయన గతంలోనూ వివిధ హోదాల్లో టీటీడీలో విధుల నిర్వహించారు. ప్రాథమికంగా అందుతున్న సమచారం ప్రకారం.. ఆయనకు ఆదయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. లోకనాథంపై పలు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. చాలా ఏళ్ల తర్వాత టీటీడీ అధికారి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి నివాసంలో 2016లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీటీడీ అధికారి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి ఏసీబీ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

లోకనాథం గత ప్రభుత్వ హయాం నుంచి గతేడాది అక్టోబర్ నెల వరకు తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన్ను తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి డిప్యూటీ ఈవోగా బదిలీ చేశారు. పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్ తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా నియమించారు. ఆ తర్వాత మళ్లీ బదిలీలు చేపట్టగా.. లోకనాథం తిరుచానూరు ఆలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి డిప్యూటీ ఈవోగా వచ్చారు. తిరుమల ఆలయంలో డిప్యూటీ ఈవోగా ఉన్న హరీంధ్రనాథ్‌ను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవోగా బదిలీ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam