Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Today Horoscope in Telugu: రాఖీ పండుగ వేళ అతిగండ యోగం ప్రభావంతో మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు మూడింతల లాభాలు!

Today Horoscope in Telugu: రాఖీ పండుగ వేళ అతిగండ యోగం ప్రభావంతో మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు మూడింతల లాభాలు!

Telugu Samayam 2 weeks ago

Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు అతిగండ యోగం ప్రభావంతో మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.


Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంతేకాదు ఈరోజు రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకోనున్నారు. దీంతో పాటు అతిగండ, సుకర్మ యోగాల ప్రభావంతో మిథునం, సింహం సహా ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరోవైపు చంద్ర గ్రహణం కూడా ఇదే రోజున ఏర్పడనుంది. ఈ కారణంగా మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ''ఆచార్య క్రిష్ణ దత్త శర్మ'' మాటల్లో తెలుసుకుందాం.మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి వారికి రాఖీ పౌర్ణమి రోజున శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. శుభ యోగాల ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ తోబుట్టువులతో ఉండే అపార్థాలన్నీ తొలగిపోయి, మంచి సంబంధం ఏర్పడనుంది.

ఉద్యోగులకు కార్యాలయంల కొత్త బాధ్యతలు ఏర్పడొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.


వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి నుంచి చంద్రుడు దశమ స్థానం నుంచి పదకొండో స్థానంలోకి మారనున్నాడు. ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.

ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ తోబుట్టువుల నుంచి మంచి ప్రయోజనం పొందొచ్చు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో దానధర్మాలు చేయాలి.


మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారికి ఈరోజు రక్షా బంధన్ పండుగ సందర్భంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలు కనిపించొచ్చు. మీకు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభించే అవకాశాలున్నాయి.

మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీకు తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

పరిహారం : ఈరోజు కనకధార స్తోత్రం పఠించాలి.


కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడిని కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం : ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి.


సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈరోజు శ్రావణ పౌర్ణమి వేళ శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. శుభ యోగాల ప్రభావంతో ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది.

వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ తోబుట్టువుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించొచ్చు. తోబుట్టువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీకు బంధువుల నుంచి మంచి ప్రయోజనాలు లభించొచ్చు.

పరిహారం : ఈరోజు లక్ష్మీ మంత్రాలను పఠించాలి.


కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారికి ఈరోజు శుక్రుడి అనుగ్రహంతో విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆశించిన మేరకు లాభాలు రావొచ్చు. మీకు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైన వారితో కలిసి యాత్రకు వెళ్లేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.


తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారికి రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజున విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీకు తోబుట్టువులతో సంబంధాలు గణనీయంగా మెరుగుపడతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.


వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి గురుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు రావొచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.

మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు మరియు ప్రాజెక్టులు లభించొచ్చు. ఈ రాశి నుంచి చంద్రుడు నాలుగో స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారులకు ఊహించని లాభాలొచ్చే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.


ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు రానున్నాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనేందుకు ప్రయత్నాలుచేస్తారు. ఈరోజు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. గ్రహాల అనుగ్రహంలో అన్ని రంగాల్లో మంచి విజయం సాధించొచ్చు.

పరిహారం :ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.


మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారికి రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజున శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి.

ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. ఉద్యోగులు తాము పాల్గొనే ప్రాజెక్టులలో మంచి విజయం లభించే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని స్మరించుకుంటూ దానధర్మాలు చేయాలి.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam