ప్రభుత్వాలు చెవుల్లో ఇల్లు కట్టుకుని చెబుతున్నా సైబర్ మోసగాళ్లని నమ్మి ప్రజలు మోసపోతూనే ఉన్నారు. మొదట్లో లాభాలు చూయించి.. ఆ తర్వాత ఒకేసారి ఎక్కువ డబ్బులు కట్టించుకుని చివరికి మోసం చేశారు.
విశాఖ కేంద్రంగా ట్రేడింగ్ యాప్ ద్వారా రూ. 52.16 లక్షలు కొల్లగొట్టిన అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముఠాకు సహకరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ నగరంలోని ఓ విద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని వాట్సాప్ ద్వారా కొందరు సంప్రదించారు. తాము అమెరికా స్టాక్ మార్కెట్ నిపుణులమని నమ్మించారు. లైబ్రేరియన్ వారి మాటలు పూర్తిగా నమ్మాడని నిర్థారించుకున్న తర్వాత స్టాల్టోర్ ఇన్ అనే ఫేక్ ట్రేడింగ్ యాప్‌ను బాధితుడితో డౌన్‌లోడ్ చేయించారు. మొదట్లో లాభాలు చూయిస్తూ ఆ లైబ్రేరియన్ నెమ్మదిగా వాళ్ల బుట్టలో వేసుకున్నారు.
READ ALSO అబ్బబ్బా ఏం తెలివిరా నాయనా.. పుష్ప సీన్ రిపీట్.. ఎర్రచందనం కాదు, అంతకుమించి!
ఇలానే భారీ లాభలు వస్తాయని ఆశ చూపారు. ఎక్కువ డబ్బులు పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తామని షేర్లు, ఐపీఓల పేరుతో పలుమార్లు పెట్టబడులు పెట్టించారు. మొత్తం అన్నీ కలిపి రూ. 51,25,000కు మోసం చేశారు. ఇదే తరహాలో మరో బాధితుడు దగ్గర నుంచి కూడా రూ. 91,500 మోసం చేశారు. మొత్తం ఇద్దరి దగ్గర నుంచి రూ. 52,16,500ను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, సాంకేతిక ఆధారాలత దర్యాప్తు చేపట్టారు. బాధితుల నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బులు ఏ ఏ అకౌంట్లకు వెళ్లాయో గుర్తించారు. కేవైసీ వివరాలు, టవర్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అలీ అబ్బాస్ హుస్సేన్ జాఫ్రీ, షేక్ యూసఫ్, జాకీర్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో ఫయాజ్, సులేమాన్ ఇంకొందరు కీలక నిందితులుగా ఉన్నారని.. వారంతా దుబాయ్‌లో తలదాచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయ స్థానంలో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.

