Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుఫాన్‌తో వాయిదా వేసిన కౌంటింగ్.. చీరాలలో ఎవరూ ఊహించని రీతిలో రిజల్ట్స్

తుఫాన్‌తో వాయిదా వేసిన కౌంటింగ్.. చీరాలలో ఎవరూ ఊహించని రీతిలో రిజల్ట్స్

Telugu Samayam 5 hrs ago

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ ఒకటో తేదీన పోలింగ్ జరగ్గా.. నవంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో కూటమి విజయ దుందుభి మోగించింది.

ప్రతిపక్ష వైసీపీ డీలా పడింది. కానీ సరిగ్గా ఓట్ల లెక్కింపు రోజున చీరాల మున్సిపాలిటీ పరిధిలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురిసింది.. దాంతో ఎన్నికల సంఘం అక్కడ కౌంటింగ్ ప్రక్రియను వాయిదా వేయాల్సి వచ్చింది. వాతావరణం సహకరించక ఆగిపోయిన ఆ లెక్కింపు.. నవంబర్ 6వ తేదీన జరిగింది. అయితే ఇక్కడ అనూహ్యమైన, ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి.

సాధారణంగా ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోరు ఉంటుంది. కానీ చీరాలలో జరిగిన కౌంటింగ్‌లో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్‌లో కనిపించింది. కూటమి, వైసీపీల హోరాహోరీ పోరులో ఏపీలో ఇంకో పార్టీకి ఛాన్స్ లేదనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ.. అనూహ్యంగా సత్తా చాటింది. చీరాల మున్సిపాలిటీలో విజయంతో హస్తం పార్టీ ఖాతా తెరుచుకుంది. చీరాల మున్సిపాలిటీ 25వ వార్డులో జరిగిన కౌంటింగ్ ప్రక్రియ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రావు ఘన విజయం సాధించారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తొలి గెలుపును అందించారు. ఈ విషయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానంలో నిలవగా.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మూడో స్థానానికి పడిపోయింది. అలాగే 22వ వార్డు కౌంటింగ్‌లోనూ అధికార టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది. అక్క డరెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీనే నిలిచింది.

అయితే చీరాల 25వ వార్డు నుంచి ...

చీరాల 25వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరావు గెలుపు గురించి స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ గెలుపు వెనుక ఓ సీనియర్ నాయకుడే ప్రభావమే కారణమని అందరూ భావిస్తున్నారు. ఆ నాయకుడే ఆమంచి కృష్ణ మోహన్. ఈయన ప్రభావం పని చేసిందని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కలేదు.చీరాలలో మాత్రమే దక్కటం వెనుక ఆమంచి ఎఫెక్ట్ గా విశ్లేషణలు జోరందుకున్నాయి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam