Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tula Rashi Ugadi Rasi Phalalu 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారిపై గురు, శని ప్రభావం ఎలా ఉంటుంది?

Tula Rashi Ugadi Rasi Phalalu 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారిపై గురు, శని ప్రభావం ఎలా ఉంటుంది?

Telugu Samayam 2 months ago

Tula Rashi Ugadi Rashi Phalalu 2026-27 జ్యోతిష్యం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారిపై గురువు, రాహువు, శని, కేతువు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Tula Rashi Ugadi Rashi Phalalu 2026-27 హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున శ్రీ 'పరాభవ' నామ సంవత్సరం ప్రారంభం కానుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర నవరాత్రులు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా తిష్యశాస్త్రం ప్రకారం, తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో 19 మార్చి 2026 నుంచి 6 ఏప్రిల్ 2027 వరకు గురు గ్రహం ప్రభావంతో శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కేతువు కూడా శుభ స్థానంలో సంచారం చేయనున్నాడు. కుజుడు అష్టమ స్థానంలో, రాహువు అర్థాష్టమంలో ఉండటం కారణంగా సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో తులా రాశి వారికి, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను మాటల్లో తెలుసుకుందాం.ఆదాయం-05, వ్యయం-14

తులా రాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. కేతువు అనుగ్రహంతో మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. శని కూడా లాభ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండకపోవచ్చు. సంపదకు కారకంగా భావించే గురుడు ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు అదృష్ట స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ ఆదాయం పెరగొచ్చు. కానీ శని, రాహువు కారణంగా మీకు ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది.


రాజపూజ్యం -06, అవమానం-03

తెలుగు నూతన సంవత్సరంలో తులా రాశి వారికి రాజపూజ్యం -06, అవమానం-03గా ఉంటాయి. కొత్త ఏడాదిలో కుజుడి సంచారం సమయంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2, అక్టోబర్ 31 మధ్యన గురుడి ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో బలమైన సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించొచ్చు. మరోవైపు ఆరో స్థానంలో శని సంచారం శుభప్రదంగా పరిగణించబడుతుంది.


శని ప్రభావం

తులా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని దేవుని అనుగ్రహంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పెళ్లైన వ్యక్తులకు సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులతో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. శని అనుగ్రహంతో యువత తమకు నచ్చిన రంగంలో కొలువు సాధించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి పదవులు లభించొచ్చు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు.


రాహువు ప్రభావం

తులా రాశి వారికి కొత్త ఏడాదిలో రాహువు ప్రభావంతో మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జాతకంలో కాల సర్పదోషం కలిగి ఉన్న వారికి సంతాన పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. అయితే 4 డిసెంబర్ 2026 వరకు రాహువు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సంవత్సరం ముగింపు వరకు తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఈ పరిస్థితుల ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి రాహు గ్రహ శాంతి చేయడం మంచిది.


కేతువు ప్రభావం

తులా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతువు కారణంగా సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కేతువు అనుగ్రహంతో మీ స్నేహితుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో ముఖ్యమైన విషయాలలో శాంతియుతంగా ఆలోచిస్తారు. మీకు ఇష్టమైన ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. కొన్ని పుణ్యక్షేత్రాలను సైతం సందర్శిస్తారు. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి రాహు మినహా గురు,శని, కేతు గ్రహాల వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.


విద్యా పరంగా

తులా రాశి వారికి ఉగాది నుంచి విద్యా రంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు తొమ్మిదో స్థానంలో గురుడి సంచారం కారణంగా విద్యార్థులకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురుడు కొంత అంతరాయలు కలిగించొచ్చు. మరోవైపు రాహువు పంచమ స్థానంలో ఉండటం కారణంగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది.


వ్యాపార పరంగా

తులా రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారులకు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. రాహువు బలహీన స్థానంలో ఉండటం కారణంగా వ్యతిరేక ఫలితాలు రావొచ్చు. అయితే గురుడు, శని అనుగ్రహం కారణంగా మీకు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. 27 జూన్ 2026 నుంచి నాలుగు పెద్ద గ్రహాలలో, మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఆ వ్యతిరేక గ్రహమే రాహువు. ఈ కారణంగా మీకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 12 నవంబర్ 2026 తర్వాత కుజుడి సంచారం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.


ఆరోగ్య పరంగా

తులా రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ రాశి వారికి అధిపతిగా ఉండే శుక్రుడి అనుగ్రహంతో మీ ఆరోగ్యం బాగుంటుంది. మరోవైపు రాహువు పంచమ స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు గురు గ్రహం ఏడాది ప్రారంభం నుంచి 2 జూన్ వరకు అనూల స్థానంలో ఉంటాడు. ఈ కారణంగా ఆరోగ్య పరమైన సమస్యలన్నింటికీ ఉపశమనం లభిస్తుంది. శని దేవుని అనుగ్రహం కూడా లభించనుంది.


ప్రేమ జీవితంలో

తులా రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఐదో ఇంటి అధిపతిగా పరిగణించే శని గ్రహం ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మరోవైపు రాహువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గురుడి ప్రభావంతో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. రాహువు ప్రభావంతో కొంత ప్రతికూలంగా ఉండొచ్చు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి.


పాటించాల్సిన పరిహారాలు

* తులా రాశి వారు కొత్త ఏడాదిలో శునకానికి చపాతీ తినిపించాలి.
* ప్రతి గురువారం ఏదైనా ఆలయంలో నైవేద్యం సమర్పించాలి.
* కొత్త ఏడాదిలో మద్యం, మాంసం వంటి పదార్థాలను నివారించాలి.
* మీ వ్యక్తిత్వాన్ని, స్వచ్ఛతను కాపాడుకోవడానికి సాత్విక ఆహారం తీసుకోవాలి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ''సమయం తెలుగు'' దృవీకరించడం లేదు.
Read Latest Astrology News and Telugu News


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam