TVS Scooter Price Hike: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్స్ (TVS Motors) తమ కంపెనీకి చెందిన స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
పెట్రోల్ వేరియంట్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను సైతం పెంచుతున్నట్లు వెల్లడించింది. గరిష్ఠంగా రూ.11 వేల వరకు ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది. ధరల పెంపునకు గల కారణాలను మాత్రం కంపెనీ బహిర్గతం చేయలేదు. ఈ క్రమంలో టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఆర్బిటర్, జూపిటర్, ఎన్‌టార్క్ వేరియంట్ స్కూటర్ల ధరలు ఎంత మేర పెరుగుతున్నాయో తెలుసుకుందాం.
స్కూటర్ల కొత్త ధరలు
- 3.5 కిలోవాట్ హవర్ టీవీఎస్ ఐక్యూబ్ విద్యుత్తు స్కూటర్ ధరను రూ.9 వేల మేర పెంచారు. దీంతో రూ.1.33 లక్షలుగా ఉన్న ధర రూ.1.42 లక్షలకు చేరింది.
- 2.2 కిలోవాట్ హవర్ కెపాసిటీ ఐక్యూబ్ ధర రూ.5 వేలు పెరగడంతో రూ.1.16 లక్షలకు చేరింది.
- 4.7కేడబ్ల్యూహెచ్ ఐక్యూబ్ ఎస్ ధర రూ.6 వేలు పెరగడంతో రూ.1.61 లక్షలకు చేరింది.
- 5.3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ గల ఐక్యూబ్ ఎస్‌టీ ధర రూ.3 వేలు పెరగడంతో రూ.1.75 లక్షలకు చేరింది.
- టీవీఎస్ ఆర్బిటర్ వీ1 పై రూ.11000 పెంచడంతో రూ.88,250 నుంచి రూ.99,250కి చేరింది.
- టీవీఎస్ ఆర్బిటర్ వీ2 ధరను రూ.9000 పెంచడంతో రూ.1.14 లక్షలకు చేరుకుంది.
పెట్రోల్ స్కూటర్ల కొత్త ధరలు
- టీవీఎస్ జూపిటర్ 110 మోడల్ ధరలు రూ.575 నుంచి రూ.1950 మధ్య పెంచారు. దీంతో వేరియంటును బట్టి కొత్త రేట్లు రూ.73,975 నుంచి రూ.88,850 మధ్య ఉంటాయి.
- జూపిటర్ 125 వేరియంట్ బట్టి రూ.875 నుంచి రూ.2,410 మధ్య పెంచారు. కొత్త ధరలు రూ.81,110 నుంచి రూ.89,935 మధ్య ఉంటాయి.
- ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ పై రూ.850 పెంచారు. దీంతో కొత్త ధర రూ.83,350 వద్దకు చేరింది.
- ఎడిషన్ వేరియంట్ ధర రూ.87,950 వద్ద నుంచి రూ.88,800 వద్దకు చేరింది.
- ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు మాత్రమే. వేరియంట్లు, స్పెసిఫికేషన్లు, ప్రాంతాలను బట్టి స్కూటర్ల ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించాలి.

