Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యోగులకు శుభవార్త.. PF వేతన పరిమితి రూ.25000లకి పెంపు.. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం!

ఉద్యోగులకు శుభవార్త.. PF వేతన పరిమితి రూ.25000లకి పెంపు.. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం!

Telugu Samayam 1 week ago

EPF Wage Ceiling: దేశంలోని కోట్ల మంది ప్రైవేట్, సంఘటిత రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద తప్పనిసరి పీఎఫ్ కవరేజ్ కోసం నిర్దేశించిన వేతన పరిమితిని నెలకు రూ.15000 నుంచి ఏకంగా రూ.25000లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

ఈ మేరకు మనీకంట్రోల్ ఓ కథనం ప్రచురించింది. దీని వల్ల లక్షలాది మంది అదనపు ఉద్యోగులు ఈపీఎఫ్ఓ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి రానుండడమే కాకుండా, ఉద్యోగుల పదవీ విరమణ నిధి మరింత పెరగనుంది.

దశాబ్ద కాలంగా రిటైర్మెంట్ ఫండ్ కవరేజీ వేతన పరిమితిని పెంచలేదు. చివరి సారిగా 2014లో పీఎఫ్ వేజ్ సీలింగ్‌ను రూ.6500 నుంచి రూ.15000లకు పెంచారు. తాజాగా ఈ వేతన పరిమితిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.15000 నుంచి రూ.25000లకు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మనీకంట్రోల్ కథనం పేర్కొంది. ఈ పరిమితి ఒకసారి అమలులోకి వస్తే లక్షల మంది ఉద్యోగులు అదనంగా తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ కవరేజీ పరిధిలోకి వస్తారు. అయితే, ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఏ తేదీ నుంచి అమలు చేస్తారు అనే విషయంపై క్లారిటీ రానుంది.

గతంలో 2014 సెప్టెంబర్‌లో ఈ వేతన పరిమితిని రూ.6500 నుంచి రూ.15000లకు పెంచారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ప్రభుత్వం మళ్లీ దీనిని రూ.25000 వరకు పెంచేందుకు సిద్ధమైంది. బేసిక్ పే (Basic Pay + DA) రూ.15000 కంటే ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటి వరకు ఈపీఎఫ్ కవరేజ్ పొందని కోట్లాది మంది ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. పీఎఫ్ సీలింగ్ పెరగడం వల్ల కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ ఖాతాలకు కేటాయించే యాజమాన్య వాటా 12 శాతం కూడా సమానంగా పెరుగుతుంది.

జీతం, పింఛనుపై ప్రభావం

  • ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 శాతం పాత నిబంధన ప్రకారం గరిష్ఠంగా రూ.1800 జమ అయ్యేది. ఇప్పుడు అది రూ.3000 వరకు జమ అవుతుంది.
  • పింఛను నిధి ఈపీఎస్ 8.33 శాతం పాత రూల్ ప్రకారం గరిష్ఠంగా రూ.1250 మాత్రమే జమ అయ్యేది. ఇప్పుడు అది రూ.2083 వరకు ఈపీఎస్ కు వెళ్లనుంది.
  • ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఉండగా అది మరింత పెరిగే అవకాశం ఉంది.
  • పీఎఫ్ డిడక్షన్ నెలకు రూ.1800 నుంచి రూ.3000కు పెరగడం వల్ల ప్రతి నెలా చేతికి వచ్చే జీతం తగ్గుతుంది.
  • టేక్ హోమ్ జీతం తగ్గినా యాజమాన్యం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కూడా పెరుగుతుంది. కాంపౌండింగ్ వడ్డీ కారణంగా రిటైర్మెంట్ సమయానికి మీ ఖాతాలో భారీగా పీఎఫ్ కార్పస్ సమకూరుతుంది.
  • పెరిగిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ
దీనిపై అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రైవేట్ ఉద్యోగుల భవిష్యత్తు సామాజిక భద్రత ఇది అత్యంత కీలకమైన నిర్ణయం.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam