Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Upasana: 'పెద్ది'లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్.. థియేటర్‌లో పేపర్లు ఎగరేసిన ఉపాసన.. వీడియో వైరల్

Upasana: 'పెద్ది'లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్.. థియేటర్‌లో పేపర్లు ఎగరేసిన ఉపాసన.. వీడియో వైరల్

Telugu Samayam 5 days ago

రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. థియేటర్ల వద్ద మెగా సందడి మొదలైంది.

పెద్దిగాడి ఆటకు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. చెర్రీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని సంబరాలు చేసుకుంటున్నారు. మెగా కోడలు ఉపాసన సైతం ఈ మూవీ ప్రీమియర్ చూసి ఎంజాయ్ చేశారు.

బుధవారం రాత్రి పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్లో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్‌ కు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా వచ్చారు. ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి సినిమాకి వచ్చిన ఆమె.. అభిమానుల మధ్య సినిమా చూసి వారిలో ఉత్సాహం నింపారు. రామ్ చరణ్‌ ఎంట్రీ సమయంలో ఫ్యాన్స్‌తో పాటుగా పెద్దగా అరుస్తూ, పేపర్లు ఎగరేస్తూ రచ్చ చేశారు. ('పెద్ది' మూవీ రివ్యూ)

మామూలుగా సినిమాలకు, ఇలాంటి మాస్ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండే ఉపాసన.. రామ్ చరణ్ స్క్రీన్ పై కనిపించగానే థియేటర్లో ఇలా కేరింతలు కొడుతూ, గాల్లో పేపర్లు ఎగరేస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. భర్త స్క్రీన్ ప్రెజెన్స్‌ చూసి ఆమె మురిసిపోయిందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన తన ఫ్యామిలీతో కలిసి పెద్ది సినిమాని ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


* థియేటర్లలో 'చికిరి చికిరి' సాంగ్ చూసి షాకైన ఫ్యాన్స్.. 'సరుకు సామాన్లు' లిరిక్స్ మార్చేసిన 'పెద్ది' టీమ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam