Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉప్పల్‌లో 'సన్ రైజింగ్' అవ్వలేదు.. కేకేఆర్ ముందు తేలిపోయిన కాటేరమ్మ కొడుకులు..!

ఉప్పల్‌లో 'సన్ రైజింగ్' అవ్వలేదు.. కేకేఆర్ ముందు తేలిపోయిన కాటేరమ్మ కొడుకులు..!

Telugu Samayam 3 weeks ago

పీఎల్ 2026లో వరుసగా ఐదు మ్యాచులలో గెలిచి.. పాయింట్స్ టేబుల్‌లో దూసుకొచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢీలా పడింది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచులో తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. ఓ దశలో పవర్ ప్లే ముగిసే సరికి 71/1తో నిలిచి.. భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. 165 పరుగులకు ఆలౌట్ అయింది.

ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఓపెనర్లు సన్ రైజర్స్‌కు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 3.4 ఓవర్లలో 44 పరుగులు జోడించారు. అయితే అభిషేక్ శర్మ (10 బంతుల్లో 15 రన్స్) తొలి వికెట్‌గా ఔట్ అయ్యాడు. ఈ సమయంలో ట్రావిస్ హెడ్ అదరగొట్టాడు. గత మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకి వచ్చిన అతడు.. ఈ మ్యాచులోనూ అదే రిపీట్ చేశాడు. వింటేజ్ హెడ్‌ను గుర్తుకు చేశాడు. 28 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న అతడిని వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 9 ఓవర్లలో 105/2. ఇక్కడి సన్ రైజర్స్ బ్యాటింగ్ గాడి తప్పింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా 25 కంటే తక్కువ స్కోరు నమోదు చేయని.. హెన్రిచ్ క్లాసెన్ ఈ మ్యాచ్‌లో ఆ మార్కు దాటలేకపోయాడు. 8 బంతుల్లో 11 రన్స్ చేసి, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పోవెల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. సమరణ్ రవిచంద్రన్ (4), అనికేత్ వర్మ (6), సలీల్ అరోరా (2) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇషాన్ కిషన్ 29 బంతుల్లో 42 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్.. అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. 19 ఓవర్లలో 165 పరుగులకు కుప్పకూలింది.

ఈ మ్యాచులో బౌలింగ్ చేసిన కేకేఆర్ బౌలర్లంతా కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, కార్తిక్ త్యాగీ 2 వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలా ఓ వికెట్ తీశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam