Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ వేలంలోకి వస్తే బిడ్డింగ్‌ వార్‌ ఖాయం.. ఎంత ధర పలుకుతాడో చెప్పిన సెహ్వాగ్‌..!

వైభవ్ వేలంలోకి వస్తే బిడ్డింగ్‌ వార్‌ ఖాయం.. ఎంత ధర పలుకుతాడో చెప్పిన సెహ్వాగ్‌..!

Telugu Samayam 4 months ago

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం సృష్టించాడు. 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97 పరుగులు బాది, ప్రపంచ క్రికెట్‌లో చర్చనీయాశంగా మారిపోయాడు.

దీంతో సోషల్ మీడియా నుంచి క్రికెట్ విశ్లేషకుల వరకు అందరూ వైభవ్ గురించే మాట్లాడుతున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు కామెంటేటర్లుగా ఉన్న భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ సైతం ఇదే విషయంపై మాట్లాడారు.

వీరిద్దరి చర్చల మధ్యలో వైభవ్ ప్రస్తావన వచ్చింది. ఒకవేళ వైభవ్‌ సూర్యవంశీ.. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు జరిగే వేలంలోకి వస్తే ఎంత డబ్బు చెల్లిస్తారని సెహ్వాగ్‌ని హర్భజన్ అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు వీరేంద్ర సెహ్వాగ్ ఏమాత్రం ఆలోచించలేదు. తానే గనక వేలంలో ఉంటే అతడి కోసం రూ.30 కోట్లు ఖర్చు చేస్తానని అతడు చెప్పుకొచ్చాడు. వైభవ్ ఆటకు తాను ఫిదా అయిపోయినట్లు సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

ఇక ఇక్కడే ఉన్న మరో భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం సెహ్వాగ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. తాను కూడా ఏ మాత్రం సంకోచించకుండా అంతే మొత్తాన్ని వైభవ్ కోసం ఆఫర్ చేస్తానని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డులు కొల్లగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 65 సిక్సర్లు బాదిన ఈ కుర్రాడు.. క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్స్‌ల రికార్డును బ్రేక్ చేశాడు. గేల్‌ 2012లో 59 సిక్స్‌లు కొట్టాడు.

కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అప్పటికి వైభవ్ వయసు 13 ఏళ్లే. కానీ 13 ఏళ్ల కుర్రాడి కోసం రాజస్థాన్ రాయల్స్‌ భారీ మొత్తం వెచ్చించింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో పాటు.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వైభవ్ సూర్యవంశీని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో ఈ రెండు ఫ్రాంఛైజీల మధ్య అతడి కోసం బిడ్డింగ్ వార్ జరిగింది. చివరకు రాజస్థాన్ రాయల్స్.. అతడిని దక్కించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam