Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెండితెరపై తమ్ముళ్లతో రొమాన్స్.. నిజ జీవితంలో అన్నలకు జోడీగా... హీరోయిన్ల క్రేజీ లవ్ స్టోరీస్

వెండితెరపై తమ్ముళ్లతో రొమాన్స్.. నిజ జీవితంలో అన్నలకు జోడీగా... హీరోయిన్ల క్రేజీ లవ్ స్టోరీస్

Telugu Samayam 1 week ago

సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తరచూ తెరపైకి వస్తుంటాయి. అయితే వెండితెరపై తమ్ముళ్లతో కలిసి రొమాన్స్ చేసి...

నిజ జీవితంలో మాత్రం వారి సొంత అన్నలతో ఏడడుగులు వేసిన ముద్దుగుమ్మల కథలు సినీ వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాయి. తాజాగా యువ నటి కావ్య కళ్యాణ్‌రామ్, సంగీత దర్శకుడు కాల భైరవల ప్రేమ వ్యవహారం అధికారికం కావడంతో ఈ తరహా ఆసక్తికరమైన సినీ వివాహ బంధాలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

కావ్య కళ్యాణ్‌రామ్ - కాల భైరవ

బాలనటిగా 'గంగోత్రి' వంటి చిత్రాల్లో మెప్పించి ఆ తర్వాత 'బలగం', 'మసూద' చిత్రాలతో హీరోయిన్‌గా సూపర్ హిట్లు అందుకున్న కావ్య కళ్యాణ్‌రామ్.. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి చిన్న కుమారుడైన యంగ్ హీరో శ్రీసింహా సరసన 'ఉస్తాద్' చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆ చిత్ర సమయంలో శ్రీసింహా అన్న, సంగీత దర్శకుడు కాల భైరవతో కావ్యకి ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించడంతో ఈ బంధం మరోసారి వార్తల్లో నిలిచింది.

* నా కెరీర్‌లో 'మోస్ట్ ఆల్ఫా' మూమెంట్ అదే... 'పుష్ప 2'లో లేడీ గెటప్‌పై బన్నీ ఓపెన్ కామెంట్స్

శ్రీదేవి - బోనీ కపూర్

భారతీయ సినీ చరిత్రలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన దివంగత నటి శ్రీదేవి కథ కూడా ఇలాంటిదే. బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్ కపూర్‌తో కలిసి శ్రీదేవి 'మిస్టర్ ఇండియా', 'లమ్హే', 'జుదాయి' వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా నటించి అలరించారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లో భారీ ఫాలోయింగ్ ఉండేది. అయితే అనూహ్యంగా ఆమె అనిల్ కపూర్ సొంత అన్నయ్య, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ను శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు.

శ్రియా రెడ్డి - విక్రమ్ కృష్ణ

తెలుగు, తమిళ చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రియా రెడ్డి. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సరసన 'తిమిరు' (తెలుగులో 'పొగరు') చిత్రంలో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. అంతేకాదు ఆ ఓ సాంగ్‌లో విశాల్‌తో కలిసి ఆమె రొమాన్స్ పండించారు. ఆ తర్వాత విశాల్ అన్న, నిర్మాత విక్రమ్ కృష్ణతో ఏర్పడిన పరిచయం వివాహ బంధానికి దారితీసింది.

సోనియా అగర్వాల్ - సెల్వరాఘవన్

ఇలాంటి మరో ఆసక్తికరమైన జంట సోనియా అగర్వాల్, దర్శకుడు సెల్వరాఘవన్. ధనుష్ హీరోగా ఆయన అన్న సెల్వరాఘవన్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాదల్ కొండేన్', 'పుదుపేట్టై' చిత్రాల్లో సోనియా అగర్వాల్ కథానాయికగా మెప్పించారు. ఆ తర్వాత సెల్వరాఘవన్‌ దర్శకత్వంలోనే ఆమె నటించిన 7/జీ బృందావన్ కాలనీ' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇలా సినిమాల్లో తమ్ముళ్లకు జోడీగా సందడి చేసి, రియల్ లైఫ్‌లో వారి అన్నలను పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మల కథలు సినీ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతుంటాయి. తాజాగా కావ్య కల్యాణ్‌రామ్, కాలభైరవ వ్యవహారంతో ఈ టాపిక్‌పై సోషల్‌మీడియాలో మరోసారి చర్చ నడుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam