Dailyhunt
వేణు స్వామి భార్య శ్రీవాణికి మాజీ మంత్రి పేర్ని నాని భార్య సుధ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్

వేణు స్వామి భార్య శ్రీవాణికి మాజీ మంత్రి పేర్ని నాని భార్య సుధ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్

Telugu Samayam 1 week ago

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రముఖల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ఆయన సినీ, రాజకీయ, వ్యాపార రంగాల సెలబ్రిటీలకు జాతకాలు చెప్పి వార్తల్లో నిలిచారు.

వేణుస్వామిని అప్పుడప్పుడు ఆయా రంగాలకు చెందిన వ్యక్తులు కలుస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు వేణుస్వామిని కలిశారు. హైదరాబాద్‌లోని వేణు స్వామి ఇంటికి నాని సతీసమేతంగా వెళ్లారు. పేర్ని నాని దంపతులు తన ఇంటికి ఆతిధ్యానికి వచ్చారని, వారిని ఆశీర్వదించానని వేణు స్వామి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. పేర్ని నాని దంపతుల్ని శాలువాతో సన్మానించి రాజకీయ రంగ ఉన్నత పదవీ ప్రాప్తిరస్తు, తథాస్తు అని వేణుస్వామి ఆశీర్వదించారు.

వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణి (సత్యవాణి)కి మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి సుధ ఓ గిఫ్ట్ ఇచ్చారు. వీణ శ్రీవాణి స్వయంగా వీడియోను షేర్ చేశారు. 'పేర్ని నాని దంపతులు మా ఇంటికి వచ్చారు. పేర్ని సుధ చాలా భక్తి భావంతో ఉంటారు.. ఆమె నాకు మంచి వీణను గిఫ్ట్‌గా ఇవ్వాలని రెండు నెలల నుంచి కష్టపడి వీణను తయారు చేయించి తీసుకొచ్చా నాకు ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. పేర్ని దంపతులు తమ ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉందంటూ' వీడియోను పోస్ట్ చేశారు శ్రీవాణి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణుస్వామి సతీమణి సత్యవాణి వీణ శ్రీవాణిగా మంచి పాపులర్ అయ్యారు.. దేశవ్యాప్తంగా ఆమె వీణ ద్వార ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.


శ్రీవాణిది తూర్పుగోదావరి జిల్లా.. అసలు పేరు సత్యవాణి కాగా శ్రీవాణిగా పేరు మార్చుకున్నారు. శ్రీవాణి ముందు యాంకర్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత వీణతో ఫేమస్ అయ్యారు. వీణ శ్రీవాణి, వేణుస్వామిలది ప్రేమ వివాహం. శ్రీవాణి వీణ క్లాసులు తీసుకుంటున్నప్పుడు వేణుస్వామితో పరిచయం అయ్యింది.. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. శ్రీవాణి ఆర్‌ఆర్‌బీ పరీక్షరాసి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. రెండేళ్ల పాటూ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సంగీతంపై ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత యాంకరింగ్ కూడా చేశారు.. అనంతరం పూర్తిగా వీణపై దృష్టిపెట్టారు. మొట్టమొదటగా దళపతి సినిమాలోని 'సింగారాల ' పాటను వీణ మీద వాయించి ఫేమస్ అయ్యారు. శ్రీవాణి మణిశర్మ, ఆర్‌పి పట్నాయక్‌లకు ఆర్కెస్ట్రాలో కూడా వీణ వాయించారు శ్రీవాణి. మహాగణపతిం, తందనానా (సెమీ క్లాసికల్‌), మాయదారి మైసమ్మ (మాస్‌) వంటి పాటలను వీణపై వాయించి ప్రపంచ రికార్డు సాధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam