Dailyhunt
వేపపుల్లతో పళ్లు తోముతూ టీమ్ బస్ ఎక్కిన నెహ్రా.. ఇదెక్కడి మాస్‌రా మామా, వీడియో ఇదిగో!

వేపపుల్లతో పళ్లు తోముతూ టీమ్ బస్ ఎక్కిన నెహ్రా.. ఇదెక్కడి మాస్‌రా మామా, వీడియో ఇదిగో!

Telugu Samayam 1 week ago

టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న జనరేషన్‌కి ఆశిష్ నెహ్రాకి అస్సలు సంబంధమే ఉండదు. ఇప్పటికీ కీ ప్యాడ్ మొబైల్‌నే నెహ్రా వాడుతుంటాడు.

ఏదైనా సరే చాలా సింపుల్‌గా ఉంటాడు. అయితే, వేప పుల్లతో పళ్లు తోముకుంటూ టీమ్ బస్ ఎక్కడం మాత్రం ఊర మాస్ అని చెప్పొచ్చు. గుజరాత్ టైటాన్స్ బస్‌లో కనిపించిన ఈ వీడియో ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు టీమ్ బస్ ఎక్కుతుండగా.. తొలుత వచ్చిన మొహమ్మద్ సిరాజ్ బస్ డ్రైవర్‌కి విష్ చేసి హగ్ ఇచ్చాడు. దాంతో మిగతా ప్లేయర్లు, స్టాఫ్‌ కూడా అదే పని చేశారు. ఆ సమయంలో ఆశిష్ నెహ్రా చాలా సింపుల్‌గా చేతిలో వేప పుల్ల పట్టుకుని కనిపించాడు.

చేతిలో వేప పుల్లతో ఉన్న నెహ్రా అలాగే బస్‌ లోపలికి ఎక్కేశాడు. ఒక చేత్తో వేప పుల్లని పట్టుకుని అలాగే బస్ డ్రైవర్‌కి హగ్ ఇచ్చాడు. మళ్లీ అదే వేప పుల్లని నోట్లో పెట్టుకుని బస్‌లోకి ఎక్కేశాడు. అయితే, ఆశిష్ నెహ్రా ఊర మాస్ సీన్ చూసిన నెటిజన్లు కాసేపు నవ్వుకున్నా, అసలు ఆ స్థాయిలో ఉండికూడా ఇంత సింపుల్‌గా ఉన్నాడేంటి అనుకున్నారు.

ఇక ఐపీఎల్‌ 2022లో అవతరించిన గుజరాత్ టైటాన్స్ జట్టు అదే ఏడాది టైటిల్ కొట్టి సత్తా చాటింది. ఆరంభం నుంచి గుజరాత్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న ఆశిష్ నెహ్రా.. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఉండి గేమ్ ప్లాన్ చెప్తూ సోషల్ మీడియాలో అప్పట్లో ట్రోలింగ్‌కు కూడా గురయ్యాడు.

హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్న రెండేళ్లు ఒకసారి టైటిల్ సాధించగా, వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కి చేరి ఓడిపోయింది. శుభమన్ గిల్ కెప్టెన్ అయిన తర్వాత పోరాడినా టైటిల్ వరకూ చేరలేకపోయింది. ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్, రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి వెళ్లింది. గుజరాత్ టైటాన్స్ తన తర్వాత మ్యాచ్‌ని ఏప్రిల్ 8వ తేదీన అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam