Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'విశ్వంభర'కి లైన్ క్లియర్ చేసిన 'పెద్ది'... జులైలో సోలోగా వస్తోన్న మెగాస్టార్!

'విశ్వంభర'కి లైన్ క్లియర్ చేసిన 'పెద్ది'... జులైలో సోలోగా వస్తోన్న మెగాస్టార్!

Telugu Samayam 3 weeks ago

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'.

దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అయితే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తుండటంతో సినిమా విడుదలపై పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

* భారతీయ పురాణాలకు హాలీవుడ్ టచ్... జెన్-జీ కోసం గ్లోబల్ లెవెల్‌లో 'ఇతిహాస' ఫ్రాంచైజీ ప్రకటన

తాజా సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్ జూలై 10ను అధికారికంగా లాక్ చేసింది. నిజానికి ఈ సినిమా సమ్మర్ రేసులో ఉండాల్సి ఉన్నప్పటికీ, భారీ చిత్రాల విడుదల, సాంకేతిక పనుల జాప్యం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం జూన్ చివరి వారంలో రావాల్సిన ఇతర సినిమాలు, 'టాక్సిక్' వంటి భారీ చిత్రాలు వాయిదా పడటంతో జూలై రెండో వారం మెగాస్టార్‌కు సోలో రిలీజ్‌కు చక్కని అవకాశంగా మారింది. జూన్ 4న 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో నెల రోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

* ఫ్యాన్స్‌పై అంత ప్రేమ ఉంటే టికెట్లు ఫ్రీగా ఇవ్వాలి కదా!: స్టార్ హీరోలపై రవిబాబు షాకింగ్ కామెంట్స్

పురాణాల ప్రకారం విశ్వంలో ఉండేవని చెప్పే 7 ఊర్ధ్వ లోకాలు, 7 అధో లోకాలు.. అంటే మొత్తం 14 లోకాల నేపథ్యంతో ఈ సినిమా కథాంశం సాగుతుంది. కథ కేవలం భూలోకానికే పరిమితం కాకుండా, ఈ 14 లోకాలకు పొంచి ఉన్న ఏదో ఒక విపత్తును అరికట్టే దిశగా సాగుతుందని సమాచారం. ఒక సాధారణ వ్యక్తిగా కనిపించే చిరంజీవి పాత్ర, ఈ లోకాలన్నింటినీ రక్షించడానికి అతీత శక్తులతో ఎలా పోరాడింది? అనే అంశం ఉత్కంఠను కలిగిస్తుంది. చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మెజారిటీ భాగం గ్రీన్ మ్యాట్ సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంది. ప్రతి లోకానికి ఒక ప్రత్యేకమైన రంగు, వాతావరణం ఉండేలా VFX టీమ్ అద్భుతమైన పనితనం ప్రదర్శిస్తోందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ పనులు వంద శాతం సంతృప్తికరంగా పూర్తయితేనే రిలీజ్ చేయాలని దర్శకుడు వశిష్ట భావిస్తున్నారు.
మొత్తానికి తెలుగులో చాలా కాలం తర్వాత రాబోతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనులు సకాలంలో పూర్తయితే జూలై 10న బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన విశ్వరూపాన్ని చూపడం ఖాయం. లేదంటే మరో కొత్త డేట్ వెతుక్కోవాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam