Jangaon Congress Councillor Arrest: జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్.. కామాంధుడిగా మారి అర్ధరాత్రి వేళ ఓ వృద్ధురాలిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వృద్ధురాలి సమయస్ఫూర్తి, స్థానికుల అప్రమత్తతతో సదరు కౌన్సిలర్ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆయన్ను బాత్రూంలో బంధించిన స్థానికులు.. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి ఇట్లోకి చొరబడి.. వృద్ధురాలి అరుపులతో గుట్టురట్టు!
ఇదీ చూడండి: ఖమ్మం బాలిక అత్యాచారయత్నం కేసు.. బాధితురాలికి పోలీస్ కమిషనర్ పరామర్శ
బాత్రూమ్‌లోకి జంప్.. బయట నుండి లాక్ చేసిన జనం!
ఇదీ చూడండి: Kerala మహిళను ఈడ్చుకెళ్లి రాయితో కొట్టి పదో తరగతి విద్యార్థి అత్యాచారయత్నం!
కొత్త చట్టం.. కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు!
బాధిత వృద్ధురాలు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు స్టేషన్ ఘనపూర్ పోలీసులు నిందితుడైన కౌన్సిలర్ సంపత్ రాజ్‌పై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ కౌన్సిలర్ ఇంతటి దారుణానికి పాల్పడడాన్ని స్థానికులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
