Weekly Lucky Zodiac Signs జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలలో గజకేసరి రాజయోగం, బుధాదిత్య రాజయోగాల ప్రభావంతో మిథునం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.
ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
Weekly Lucky Zodiac Signs వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ రెండో వారంలో రెండు రాజయోగాల అరుదైన కలయిక జరగనుంది. ఈ వారం చంద్రుడు, గురుడు ఒకరికొకరు మధ్య స్థానంలో ఉంటారు. గురుడు మిథునంలో సంచారం చేస్తుండగా, చంద్రుడు ధనస్సులోకి ప్రవేశించిన సమయంలో, ఈ రెండు గ్రహాల మధ్య గజకేసరి యోగం ఏర్పడనుంది. మరోవైపు బుధుడు మీన రాశిలో ప్రవేశించనున్నాడు. మీనంలో ఇప్పటికే సూర్యుడు నివాసం ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా వృషభం, మిథునం సహా 5 రాశుల వారికి శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా సువర్ణావకాశాలను పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఈ సందర్భంగా ఏప్రిల్ రెండో వారంలో ఏ రాశుల వారికి అదృష్టం పెరుగుతుందనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడే చూసెయ్యండి.వృషభ రాశి(Taurus)

వృషభ రాశి వారికి ఏప్రిల్ రెండో వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరమైన విషయాల్లో మంచి లాభాలు పొందొచ్చు. ఈ వారం మీరు చేసే ఏ పని అయినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. మీరు ప్రత్యర్థులపై విజయం కూడా సాధించొచ్చు.
మిథున రాశి(Gemini)

మిథున రాశి వారు ఏప్రిల్ మాసంలోని రెండో వారంలో శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. కార్యాలయంలో మీకు సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టులో మీరు సులభంగా విజయం సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఉండే వ్యక్తులకు శుభవార్తలు వినిపించొచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లేదంటే మీ కష్టాలు పెరగొచ్చు. ఈ వారం మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. వారం చివర్లో మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి(Cancer)

కర్కాటక రాశి వారికి ఏప్రిల్ రెండో వారంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ప్రారంభంలో ఆనందంగా ఉంటుంది. ఈ వారం మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలొస్తాయి. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి.
కన్య రాశి(Virgo)

కన్య రాశి వారికి ఏప్రిల్ రెండో వారంలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. ఈ వారం మీరు పెట్టుబడుల విషయంలో చాలా బిజీగా గడుపుతారు. ఈ వారం మీరు చేపట్టే ఏ ప్రయాణమైనా మంచి విజయం సాధించొచ్చు. పని విషయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, మీకు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. వారం చివర్లో మీ ఇంట్లో శుభకార్యాలు జరగొచ్చు.
వృశ్చిక రాశి(Scorpio)

వృశ్చిక రాశి వారు వచ్చే వారం బుధాదిత్య యోగం, గజకేసరి రాజ యోగాల ప్రభావంతో సానుకూల ఫలితాలు పొందనున్నారు. ఈ కాలంలో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఈ వారం భాగస్వామ్య ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ వారం మీరు చేపట్టే ప్రయాణాల కారణంగా మీకు సులువైన విజయాలు దక్కుతాయి. మీ బంధువుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Read Latest Astrology News and Telugu News

