Posts
మిల్కీ బ్యూటీ తమన్నా గ్రూప్ వర్కవుట్ వీడియోను త్వరలో షేర్ చేస్తుందట !

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా అందం వెనక రహస్యం ఏమిటో కనిపెట్టేందుకు అభిమానులు ఇన్నాళ్లు చాలా ప్రయాసలు పడ్డారు అది 'జిమ్ముల్లో వర్కవుట్లు' లే అంట. అన్నిటికీ ఇప్పుడు సమాధానం ఇచ్చేందుకు తమన్నా ప్రాక్టికల్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇటీవల తమన్నా కు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకుని కోలుకున్నక .. అందం అరోగ్యం కాపాడుకోవడం కోసం శ్రమిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తి నింపుతోంది. నిరంతరం జిమ్ముల్లో వర్కవుట్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.
ఈసారి గ్రూప్ వీడియోలను షేర్ చేసేందుకు తమన్నా సిద్ధమవుతోంది.
తాజాగా తన గ్యాంగ్ తో కలిసి జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న ఫోటోని తమన్నా షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం అభిమానుల్లోకి వైరల్ గా మారింది. పోస్ట్ వర్కవుట్ గ్లో.. గర్ల్స్ స్క్వాడ్..
కార్డియో.. లవ్ ఫ్యాట్ లాస్.. అంటూ హ్యాష్ ట్యాగ్ లు ఈ ఫోటోతో పాటే వైరల్ అవుతున్నాయి. ఈసారి మిల్కీ వైట్ బ్యూటీ గాళ్స్ గ్యాంగ్ తో జిమ్ చేస్తున్న వీడియోల్ని రిలీజ్ చేయనుందట.
తాజాగా తన తమన్నా జిమ్ముల్లో వర్కవుట్లు చేస్తున్న వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే కదా !