Wednesday, 27 Jan, 7.16 pm తెలుగు సిరా

హోమ్
అక్కిపై నెటిజన్ల ట్రోల్స్ దాడి.. కారణం అదే..

బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఫాన్ ఫాలొయింగా దేశ వ్యాప్తంగా ఉంటుంది. అతడి సినిమా అంటే చాలా కొత్తగా ఉంటుందని భావిస్తారు. ఈ హీరో వివాదాలకు, అనవసర విషయాలకు చాలా దూరం పాటిస్తాడు. అందుకే అతడిని ఎవ్వరూ ఏమనరు. అటువంటిది ఇటీవల అక్కి ట్రోలింగ్‌కు గురయ్యాడు. దయ లేకుండా ట్రోలర్స్ ఖిలాడీ అక్షయ్‌పై ట్రోల్స్‌తో దండయాత్ర చేశారు. ఎంతో సైలెంట్‌గా ఉండే అక్షయ్ ట్రోలర్స్ బారిన ఎందుకు పడటం ఏంటని ఆలోచిస్తున్నారా! అది కూడా చెప్తా.. ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలు నీళ్ల కోసం ఎంతో దూర ప్రాంతాలకు కాలి నడక వెళ్తున్నారని, వారికి ఆ బాధ లేకుండా చెయ్యాలన్న భావంతో ఓ సంస్థ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ సంస్థ తన పథకాన్ని చెప్పేందుకు చిన్న సమావేశాన్ని చేసింది. అందులో ప్రత్యేక అతిథిగా అక్షయ్ వీచ్చేశాడు. ఈ సంస్థ రీసెర్చ్ ప్రకారం కొన్న ప్రాంతాల ప్రజలు కేవలం ఒక్క బిందెడు నీళ్ళ కోసం దాదాపు 21కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళుతున్నాని తేలింది. దాంతో వారు ఎంతటి బాధకు గురవుతున్నారని చెప్పేందుకు అక్షయ్ ట్రేడ్ మిల్‌పై నడిచాడు. ఈ మేరకు ట్వీటర్‌లో వచ్చిన ఫోటోలో మిషన్ పాని అప్‌లోడేడ్‌కి అక్షయ్ ఫోటో చూసి అందరూ రియాక్ట్ అయ్యారు. దాంతో దీనిపై నేటిజన్లు అక్షయ్‌ను ట్రోల్ చేయడం మొదలు చేశారు. 'మండే ఎండలో కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్లే వచ్చే బాధ. ఏసీ ఉన్న గదిలో కాసేపు ట్రేడ్ మిల్‌పై నడిస్తే అర్థం కాందం'టూ కామెంట్లు చేశారు. ఇదే విధంగా అనేక మంది చాలా వైటెంట్‌గా రియాక్ట్ అయ్యారు. దీనిపై అక్షయ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top