Thursday, 06 May, 8.20 pm తెలుగు సిరా

పొలిటిక్స్ న్యూస్
భారత్ సురక్షితంగా లేకుంటే ప్రపంచం కూడా ఉండదు: మజుందార్ షా

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తాజా పరిస్థితిపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా స్పందించారు. యథేచ్ఛగా అసెంబ్లీ ఎన్నికలు, పండుగలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. రెండో దశలో కరోనా వైరస్ భారత్‌లో చెలరేగిపోతోందని, ఈ దశలో ఇది సునామీలా విరుచుకుపడిందన్నారు. గ్లోబల్ వ్యాక్సిన్ ఈక్విటీపై 'వన్ షేర్ వరల్డ్' నిర్వహించిన వర్చువల్ ప్యానెల్ చర్చలో పాల్గొన్న కిరణ్ మజుందార్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలంటే టీకాల ఉత్పత్తిని పెంచడం ఒకటే మార్గమన్నారు. భారత్ కనుక సురక్షితంగా లేకుంటే ప్రపంచం కూడా సురక్షితంగా ఉండదని తాను చెప్పగలనన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top