Tuesday, 11 Feb, 11.49 am తెలుగు సిరా

హోమ్
ఢిల్లీ ప్రజల సమన్వయం.. అప్పుడు వాళ్లకు ఇప్పుడు వీళ్లకు

ప్రస్తుతం ఢిల్లీ లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం ఆప్ 53 స్థానాల్లో ముందంజలో ఉంటె బీజేపీ మాత్రం 17 స్థానాల్లోనే ముందజలో ఉంది. ఇక కాంగ్రెస్ అయితే శూన్యం లో ఉంది. అయితే మనం కొద్దిగా గతం లోకి వెళ్తే 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలను చూసుకుంటే ఢిల్లీ లోని మొత్తం 7 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అదే నమ్మకంతో మేము ఇప్పుడు కూడా గెలుస్తాం అని బీజేపీ చెప్పారు నాయకులు. కానీ ఇప్పుడు చూసుకుంటే దానికి మొత్తం భిన్నంగా జరుగుతుంది. అయితే ఈ సంవత్సర కాలంలో అక్కడ ఏం జరిగింది... అక్కడి ప్రజల్లో ఎందుకు అంత మార్పు వచ్చింది అనేది తెలియదు... ఈ సంవత్సరంలో బీజేపీ పాలనా మీద ఢిల్లీ ప్రజలకు నమ్మకం పోయిందా... లేక ఆప్ పాలనపై నమ్మకం కలిగిందా... లేక అప్పుడు వాళ్ళను గెలిపించాం ఇప్పుడు వీళ్ళను గెలిపిదం అని ఢిల్లీ ప్రజలు సమన్వయం పాటిస్తున్నారా అనేది తెలియదు. కానీ వస్తున్న వివరాల వల్ల బీజేపీ కి కొంచెం షాక్ గాను కొంచెం నిరాశగాను అనిపిస్తుంటుంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top