Wednesday, 11 Mar, 10.33 am తెలుగు సిరా

హోమ్
ధోనిలాంటి ఫినిషర్‌ కావాలి...

ధోని...అంటే భారత్‌లోనే కాదు... ప్రపంచ దేశాల్లోనూ ఎంతో క్రేజ్‌. కూల్‌ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనికి పేరు. తన వ్యూహాలతో ఓటమిలో ఉన్న జట్టును సైతం గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు ఎమ్‌ఎస్‌ ధోని. భారత జట్టుకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఘనుడు. ఎలాంటి మ్యాచ్‌నైనా...తన బ్యాటింగ్‌తో ఫినిషింగ్‌ చేస్తాడు. అలాంటి ధోనికి ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఉంది. కానీ ధోనిపై విదేశీ ఆటగాళ్లు, సినీయర్‌ ఆటగాళ్లు టీమీండియాకు ధోని ఆడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆసీస్‌ కోచ్‌ కూడా ధోనిపై కామెంట్‌ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తమకు ధోనీలాంటి ఫినిషర్‌ అవసరం చాలా ఉందని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. ఈ నెల 13నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ మిడిలార్డర్‌ సత్తాను పరీక్షించుకోవడంతోపాటు ఫినిషర్‌ పాత్రకు ఎవరు సరిపోతారనేది కూడా తేల్చనున్నారు. 'గతంలో మా జట్టకు బెవాన్‌,మైక్‌ హస్సీ ఫినిషర్‌ పాత్రను అద్భుతంగా పోషించారు. భారత్‌కు ధోనీ కూడా అలాంటి వాడే. నాకు తెలిసి ఇలాంటి ఆటగాళ్లు ప్రతీ జట్టుకు అవసరం' అని లాంగర్‌ అభిప్రాయపడ్డాడు.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top