Sunday, 07 Jun, 7.59 am తెలుగు సిరా

హోమ్
కరోనా కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. ఒకేరోజు 400లకు పైగా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కోరలు చేస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాలు కరోనా కేసుల్లో పోటీ పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 4వందలకు పైగా కేసులతో మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏపీలో నిన్న ఏకంగా 210 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,460కి పెరిగింది. తాజాగా డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,323కి చేరింది. మొత్తం 73 మంది మృతిచెందగా.. ప్రస్తుతం 1,192 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 206 మందికి వైరస్ సోకగా..ఒక్కరోజే 10మంది మృతిచెందడం వణుకు పుట్టించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 152 కేసులు..మేడ్చల్ 18, రంగారెడ్డి 10, నిర్మల్-యాదాద్రిలో ఐదేసి కేసులు...మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల-నాగర్‌కర్నూలులో రెండేసి కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్, వికారాబాద్, జనగాం, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కో కరోనా కేసు నమోదైంది. తెలంగాణలో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 3వేల496 ఉండగా..ఇప్పటివరకు 123మంది మహమ్మారికి బలయ్యారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>