Saturday, 28 Mar, 5.20 pm తెలుగు సిరా

పొలిటిక్స్ న్యూస్
కరోనా పై కొత్త పాట విడుదల చేసిన సిఎస్కె బౌలర్...

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు కరోనా. ఈ వైరస్ పేరు వింటే చాలు అని దేశాలు హడలెత్తి పోతున్నాయి. చైనా నుండి వచ్చిన ఈ వైరస్ ప్రభావం అని రంగాలపైనా పడుతుంది. అలాగే ఈ వైరస్ క్రీడా ప్రపంచాన్ని కూడా నిలిపివేసింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా అన్ని ప్రధాన క్రీడా కార్యక్రమాలు వాయిదా వేయబడ్డాయి లేదా రద్దు చేయబడ్డాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు ఆటలు లేకపోవడం వలన రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో, తన పాటలతో కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారిపై తన కొత్త పాటను అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ లో వినిపించాడు. అయితే ఈ పాట కొద్ది సమయం లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ ప్రపంచ కరోనా సంక్షోభం మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనోధైర్యాన్ని పెంచడానికి డ్వేన్ బ్రావో ఈ కొత్త పాట విడుదల చేసినట్టు వెల్లడించాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అపూర్వమైన భావోద్వేగాలను ప్రతిబింబించడంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కళాకారులు తమ వంతు కృషి చేశారు. అంతకుముందు, న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోధి ఒక పాటతో ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాడాలని మరియు అపరిచితులతో ప్రత్యక్ష సంబంధాన్ని పెట్టుకోకూడదని అలాగే క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మరియు ఇంట్లో ఉండడం వంటి అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండాలని బ్రావో ప్రజలకు విజ్ఞప్తి చేసాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top