Tuesday, 11 Feb, 11.41 am తెలుగు సిరా

హోమ్
కివీస్ లక్ష్యం 297... ఇది వాళ్లకు సరిపోతుందా..?

భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ రోజు మూడో వన్డే జరుగుతుంది. అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కివీస్. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి గాను 296 పరుగులు చేసింది. ఇందులో రాహుల్(112) సెంచరీతో రెచ్చిపోగా అయ్యర్ (62), మనీష్ పాండే (42) పృథ్వీ షా(40) పరుగులు చేసారు. అయితే భారత్ ఇచ్చిన ఈ లక్ష్యం వారికి సరిపోతుందా..? అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు ఎందుకంటే జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లోనే 349 పరుగులను ఇంకా పది బంతులు ఉండగానే చేధించింది కివీస్... అయితే రెండో వన్డే లో మాత్రం భారత బౌలర్లు కివీస్ ని 273 పరుగులకే కట్టడి చేసారు ఐన మనం ఆ మ్యాచ్ ఓడిపోయాం... అయితే ఇప్పుడు భారత్ ని ఎలాగైనా క్లీన్ స్విప్ చేయాలనీ కివీస్ చూస్తుంటే కనీసం ఈ మ్యాచ్ అయిన గెలిచి పరువు కాపాడుకోవాలని టీం ఇండియా చూస్తుంది... మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top