హోమ్
క్రాక్ పోలీసోడు మళ్లీ పెంచేశాడుగా..?

చిత్ర సీమలో ఎవ్వరూ కూడా తమ పారితోషికాన్ని పదేపదే పెంచరు. తమ సినిమాలను ఎంచుకునే విధానంలో మార్పులు తెస్తారు గానీ పారితోషికంలో మార్పులు దాదాపుగా ఉండవు. వరుస హిట్లు అవికూడా బాక్సాఫీస్ బద్దలు కొడితే తమ పారితోషికాన్ని పెంచుతుంటారు. కానీ టాలీవుడ్లో మాత్రం ఓ హీరో పారితోషికం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. అతడే మాస్ మహరాజా రవితేజా. ఈ విషయం అందిరికీ తెలిసిందే. అతడు సినిమాకి రెమ్యూనిరేషన్ పెంచేశాడని, తగ్గించుకోమన్నా వినడం లేదని తరచుగా వార్తలు సర్కులేట్ అవుతూనే ఉంటాయి. అయితే మళ్లీ ఇటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. రవితేజా క్రాక్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ముందువరకు సినిమాకి రూ.10-12 కోట్లు తీసుకునే వాడట.
తాజాగా సినిమాకి రూ.15కోట్లు డిమాండ్ చేస్తున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రవితేజా విషయంలో ఇదేమీ కొత్త కాదు. తన సినిమా హిట్ అయితే పారితోషికం పెరిగుతుంది. అతడు పెంచిన పారితోషికానికి ఓకే అనుకున్న వారే తనతో సినిమాలు చేస్తారని అంటుుంటారు. ఇదిలా ఉంటే రవితేజా తాజాగా రమేష్ దర్శకత్వంలో మరో మాస్ మసాలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి ఖిలాడీ పేరును ఖరారు చేశారు. ఈ సినిమాను నిర్మాస్తున్నది పేరు పొందిన నిర్మత కాదు. ఇందులోని హీరోయిన్లు కూడా కొత్తవారే. ఈ క్రమంలో ఈ సినిమా జరిగే బిజినెస్ మొత్తం రవితేజా పేరుపై ఆధారపడి ఉంటుంది. దాంతో ఇలాంటి సినిమాలకి అధిక పారితోషికం ఆశిస్తే తప్పేంటని రవితేజా సన్నిహితులు అంటున్నారు.