Saturday, 28 Mar, 4.41 pm తెలుగు సిరా

హోమ్
మెగాస్టార్ తో చిందేయనున్న జబర్దస్త్ బ్యూటీ...

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తన 152 వ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా పేరు "ఆచార్య" అని చిరు పొరపాటున చెప్పేసారు. అంతే కాకుండా ఈ సినిమాలో మెగాస్టార్ కు సంబంధించిన ఓ ఫోటో కూడా లీక్ కావడం సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలో చిరు హీరోయిన్ కు సదంభంధించి రోజుకో పేరు వినబడుతుంది ప్రస్తుతం చిరంజీవి కి జంటగా నటించేది కాజల్ అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఉన్న ఐటం సాంగ్ లో రెజీనా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇంకో స్పెషల్ సాంగ్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సాంగ్ లో జబర్దస్త్ బ్యూటీ అనసూయ మెగాస్టార్ తో చిందులేయనున్నటు వార్తలు సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే అనసూయకి మెగా హీరోల సినిమాలో అవకాశాలు బాగానే వస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ సమాచారం నిజమైతే అనసూయ పంట పండినట్లే అని అంటున్నారు ప్రేక్షకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top