హోమ్
పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక యాప్ : నిమ్మగడ్డ

ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. అది కేవలం పోలింగ్ కేంద్రంలో కొద్ది ప్రాంతాన్ని మాత్రమే రికార్డ్ చేయగలుగుతుందని అభిప్రాయపడ్డారు. వెబ్ కాస్టింగ్ లో పూర్తిస్థాయి నాణ్యత వుండటం లేదని.. వెబ్ కాస్టింగ్ పరిధి దాటి జరిగే సంఘటనల మాటేంటి? అని పేర్కొన్నారు. దీని కోసం ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చిందని...ఈ యాప్ ద్వారా పౌరులు ఎవరైనా గొడవలు, ఇతరత్రా అసాంఘీక చర్యల పై వెంటనే సమాచారం పంపవచ్చని తెలిపారు. వీడియోతో పాటు ఎస్ఎంఎస్ కూడా పంపే వెసలుబాటు వుంటుందని..
వాక్సినేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు.. అందుకు తగ్గ ఏర్పాట్లు పక్కాగా జరగాలని కలెక్టర్లలకు ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ. అధికారులు కూడా ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని..కొంతమంది అధికారులు ఎన్నికల ప్రక్రియను వ్యతిరేకించారు..అలాంటి వారిని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు.
related stories
-
జిల్లా వార్తలు అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా
-
జిల్లా వార్తలు సామాజికసేవలో ముందున్నాం
-
జిల్లా వార్తలు పోలింగ్ నిర్వహణపై సూక్ష్మ దృష్టి సారించాలి