Saturday, 15 Feb, 12.33 pm తెలుగు సిరా

హోమ్
రిటైర్మెంట్‌పై ధోని నిర్ణయం తీసుకోవాలి : ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌

ధోని పేరు చెప్పగానే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఓ ఉత్సహాం. అతడు మ్యాచ్‌ ఆడితే చాలు... మ్యాచ్‌ గెలిచినట్టే. ఓటమి దశలో ఉన్న మ్యాచ్‌ను సైతం తన కూల్‌ మైండ్‌తో విజయ తీరాలకు చేర్చుతాడు. తన ఒట్టి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఘనుడు ధోని. రెండు ప్రపంచ కప్‌లను భారత్‌కు అందించిన గొప్ప కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని. అలాంటి ధోనిపై ఐపీఎస్‌ మాజీ చైర్మన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేసాడు. 'రిటైర్మెంట్‌పై ధోని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి' రాజీవ్‌ శుక్లా అన్నాడు. ధోని భారత జట్టుకు ఎన్నో విజయాలను తెచ్చిపెట్టాడని పొగిడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్‌పై ఆటగాళ్లే నిర్ణయం తీసుకోవాలని గుర్తుచేశారు. భారత జట్టుకు ఇలాంటి ఆటగాడు దొరకడని తెలిపాడు. ఐతే రెండు నెలలు ఆర్మీకి సేవలు అందించడానికి ధోని విరామం తీసుకున్నాడు. ఐతే ఇటీవల ప్రకటించిన బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ధోనిని చేర్చలేదు. దీంతో ధోని కెరిర్‌ ముగిసినట్టేనని అందరూ అనుకుంటున్నారు. కానీ ధోని మరుసటి రోజే నెట్స్‌లో ప్రాక్టిస్‌ చేసాడు.

ధోని మళ్లీ భారత జట్టుకు ఆడాలని చాలా మంది మాజీలు కోరుకుంటున్నారు. ఐపీఎల్‌లో తన సత్తా చాటి, టీ-20 వరల్డ్ కప్‌ జట్టులో స్థానం సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మిస్టర్‌ కూల్‌గా పిలవబడే ధోని.. భారత జట్టుకు తిరిగులేని విజయాలు అందించాడు. చాలా మంది యువ క్రికెటర్లను జట్టుకు అందించాడు. ధోని నిర్ణయాలతో 'ధోని రివ్యూ సిస్టం'గా మారిపోయాడు. ధోని భవితవ్యం తేలాలంటే ఐపీఎల్‌ అయ్యేవరకు వేచి చూడాల్సిందే...
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top