Sunday, 08 Mar, 12.41 pm తెలుగు సిరా

హోమ్
రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోని...!

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని తన భవిష్యత్‌ గురించి ఒక క్లారిటీ ఇచ్చాడని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వెల్లడించారు. గత ఏడాది జులైలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు ధోని దూరంగా ఉంటున్నాడు. ఇటీవల చీఫ్‌ సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్‌ పదవీకాలం ముగిసిన విషయం విధితమే. చీఫ్‌ సెలక్టర్‌గా కెప్టెన్సీ బాధ్యతలను ధోని నుంచి కోహ్లికి సజావుగా బదిలీ చేసిన ఎమ్మెస్కే ధోని రిటైర్మెంట్‌పై మాత్రం ఓ స్పష్టత ఇవ్వలేకపోయాడనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కానీ ధోని ఎప్పుడో సెలక్టర్లకు, టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తన భవిష్యత్‌పై క్లారిటీ ఇచ్చాశాడని తాజాగా ఎమ్మెస్కేప్రసాద్‌ వెల్లడించారు. కొత్త చీఫ్‌ సెలక్టర్‌గా సునీల్‌జోషి ఇటీవల ఎంపికయ్యాడు. ధోని తన భవిష్యత్‌పై పూర్తి స్పష్టతతో ఉన్నాడు. ఈ మేరకు టీమిండియా మేనేజ్‌మెంట్, నాతో అతను చర్చించి.. తన భవిష్యత్‌ నిర్ణయాలు చెప్పాడు. ధోనితో చర్చలు చాలా ఉత్తమమైనవి అని వెల్లడించారు. వాస్తవానికి 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోని రిటైర్మెంట్‌ ప్రకటించేస్తాడనే వూహాగానాలు వినిపించాయి. కానీ ధోని మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌ వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని కూడా వూహాగానాలు వినిపించాయి. ధోని మాత్రం మౌనంగా ఉన్నాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌ మార్చి 29 నుంచి ప్రారంభంకానుండగా.. ఇప్పటికే చెన్నై చేరుకున్న ధోని చెపాక్‌ స్టేడియంలో రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ టోర్నీలో ధోని నిలకడగా రాణించగలిగితే..? అక్టొబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు అతను ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయని ఇటీవల టీమిండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్ర్తి చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. ప్రస్తుతానికి మాత్రం ధోని ప్రత్యేక శ్రద్ధ మాత్రమే కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ధోని రిటైర్మెంట్‌పై ఐపీఎల్‌ తర్వాత తెలిసే అవకాశం ఉంది.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top