Monday, 13 Jul, 4.49 pm తెలుగు సిరా

హోమ్
సాఫ్ట్ వేర్ లహరి ఆత్మహత్య కేసులో మరో వీడియో వెలుగులోకి..

తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య లహరి కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమె భర్త వెంకటేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో లహరి ఇలా అన్నది. ప్రేమపేరుతో నా వెంట పడ్డావు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు నేను సిద్ధపడ్డాను. మతం మార్చుకుంటానని నమ్మబలికారు. పెళ్లి పెళ్లి చేసుకున్నాక నీ విశ్వరూపం నాకు తెలిసింది. నీకు ఉద్యోగం లేకపోయినా సంవత్సరాల తరబడి పోషించాను. ఉద్యోగం వచ్చాక నన్ను చిత్రహింసలకు గురి చేశావు. ప్రతిరోజు నన్ను కొట్టే వాడివి ప్రతి రోజు నన్ను బూతులు తిట్టే వాడివి. మీ కుటుంబ సభ్యుల ముందు కూడా నన్ను కొట్టావు. అమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు తిరిగావు.అమ్మాయిలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసావ్. నువ్వు చేసిన తప్పు అని ఎదిరిస్తే నన్ను కొట్టావు నీ బాధను భరిస్తూ వచ్చాను. నేను సంపాదించిన ఆస్తి మొత్తం నీ ఆస్తిగా చెప్పుకున్నాం. ఇన్ని చిత్రహింసలు చేసిన ఇప్పటికీ నీ మీద ప్రేమ ఉందంటూ లహరి తన భర్తకు వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో 13 నిమిషాల పాటు ఉంది. భర్తతో పాటు అత్తమామల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. తన తల్లిదండ్రులను క్షమించమని లహరి కోరింది.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top