Saturday, 28 Mar, 5.41 pm తెలుగు సిరా

హోమ్
సినీ కార్మికుల కోసం కింగ్ నాగార్జున్ విరాళం..ఎంతంటే?

దేశంలో వరుస కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 800కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా పరిశ్రమ కూడా మూత పడింది. ప్రస్తుతానికి షూటింగ్ లను నిలిపివేశారు. దీంతో పలువురు హీరోలు నటులు సినీ కార్మికుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. కాగా తాజాగా ఆ లిస్టులో కింగ్ నాగార్జున కూడా చేరారు.ఆయన కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ లాక్ డౌన్ మనకి అత్యంత అవసరం అని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని అయన పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top