Wednesday, 05 Aug, 10.57 am తెలుగు సిరా

హోమ్
సూర్యాపేట జిల్లాలో విషాదం..!

తెలంగాణ సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంధువుల్ని కలిసి అత్తారింటికి వెళ్తున్న యువకుడు అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. పొలం దున్నేందుకు వ్యవసాయ పరికరాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొని, ఇనుప నాగలి అతని గొంతుకు బలంగా గుచ్చుకుపోవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణం వెంకటగిరి ప్రాంతానికి చెందిన బండ్ల సంతోష్‌ .. అదే జిల్లాలోని తిర్మలాయపాలెం మండలం కాకరవాయిలో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిని పలకరించి తన అత్తగారు ఊరైన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌)కు బైక్‌పై బయల్దేరాడు. మరోవైపు పొలం పనులు చేసేందుకు ఓ ట్రాక్టర్‌ ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బోట్యాతండా నుంచి తిర్మలాయపాలెం మండలం సోలిపురంలో వెళ్తోంది. ట్రాక్టర్‌ ఇంజిన్‌కు మించి వెనకవైపు పొడవైన ఇనుప నాగలి అడ్డంగా ఉంచారు. అది కనిపించక ఎదురుగా బైకుపై వస్తున్న సంతోష్‌ గొంతుభాగంలో లోతుగా గుచ్చుకుంది. కొంతదూరం అలాగే ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేస్తామని ఎస్సై కె.గోవర్ధన్‌ తెలిపారు. అత్తారింటికి బయల్దేరిన సంతోష్ ఇలా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top