Friday, 23 Oct, 4.49 pm తెలుగు సిరా

హోమ్
తెలుగు స్టార్ యాంకర్ కు కరోనా .. షాక్ లో ఫ్యాన్స్

తెలుగు టీవీ, సినీ ప్రేక్షకులకు రష్మి గౌతమ్ గురించి సెపేరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. రష్మీకి ఇటీవల స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించగా కరోనా టెస్ట్ చేయించుకుందని, ఆ రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆమె షూటింగ్స్‌ అన్నింటికీ దూరంగా ఉంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించి అక్టోబర్ 23వ తేదీన అలాగే అక్టోబర్ 28 తేదీన జరిగే షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు యూనిట్ వర్గాలు పేర్కొనడంతో జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. అయితే తనకు కరోనా సోకినట్లు రష్మీ గౌతమ్ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఇక సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డారని గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. దిలా ఉండగా, రష్మీ గౌతమ్ నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నందుతో కలిసి నటించారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్న సమయంలోనే రష్మీకి కరోనా సోకడంతో ఆ కార్యక్రమాలను కూడా కొద్ది రోజులు నిలిపివేసినట్టు తెలుస్తున్నది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top