Monday, 14 Jun, 5.17 pm తెలుగు సిరా

హోమ్
వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం...

కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.. కరోనా బారినపడి చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందించనున్నారు.. కోవిడ్‌తో డాక్టర్ చనిపోతే వారి కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్ నర్స్‌ల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున, ఎంఎన్‌వో, ఎఫ్ఎన్‌వో చనిపోతే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం.. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది.. కోవిడ్ విధులకు సంబంధించి డ్యూటీల్లో ఉంటూ కరోనా సోకి చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ పరిహారం వర్తింపజేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top