Thursday, 06 May, 10.17 pm తెలుగు సిరా

హోమ్
వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష...

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. కోవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, విజయోగదారుల పై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపిన కన్నబాబు రాయితీపై విత్తనాలు పంపిణి కార్యక్రమం, రబి 2020-21 పంట ఉత్పత్తి కొనుగోలు అంశాల పై దిశానిర్దేశం చేసారు. కోవిడ్ పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి నష్టం రాకుడదని సీఎం ఆదేశించారు. వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలి. విత్తనాల సరఫరాకు ఎటువంటి రవాణా ఆటంకాలు తలేత్తకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యావసర వస్తువులు రవాణాకు కూడా తగిన అనుమతులు కల్పించాలి. రైతులకు అవసరమైన ఎరువులు, రసాయనాల దుకాణాలు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలి. కోవిడ్ వల్ల రైతు ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలి అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top