Dailyhunt
విజయ్ దేవరకొండ కోసం రెడీ చేసిన కథలో నాగ చైతన్య

విజయ్ దేవరకొండ కోసం రెడీ చేసిన కథలో నాగ చైతన్య

ఓ బేబీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. గతంలో విజయ్ దేవరకొండ కోసం నందిని రెడ్డి ఒక సినిమా చేస్తుందని టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం రెడీ చేసిన కథతో నాగ చైతన్యని డైరెక్ట్ చేయనుందని తాజా సమాచారం.

లవ్ స్టొరీ సినిమా ఘన విజయం సాధించడంతో మంచి జోష్ లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' మూవీ చేస్తున్నాడు.

అలాగే తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్‌లో 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా లోనూ నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా ఉండగానే తాజాగా డైరెక్టర్ నందినీ రెడ్డితో కూడా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi