Dailyhunt
ఆ ఫోన్ లో అలాంటివి కనపడవు..

ఆ ఫోన్ లో అలాంటివి కనపడవు..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ప్రపంచం నడుస్తుంది..ఎవరి చేతిలో చుసిన స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అలాగే ఇంటర్ నెట్ కూడా అదే రీతిలో ఉండడం తో ఎవరికీ కావాల్సింది వారు స్మార్ట్ ఫోన్ లో చూస్తూ ఆనందిస్తున్నారు. అలాగే పోర్న్ వీడియోస్ కూడా అదే రీతిలో చూస్తూ వారి కోరిక తీర్చుకుంటున్నారు. అయితే అలాంటి వారికీ జపాన్ ఫోన్ చెక్ పెట్టింది. ఈ ఫోన్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. వీడియోలు కూడా తీసుకోవచ్చు. కానీ నగ్న పిక్స్ కానీ వీడియో కానీ తిస్తె ఒప్పుకోదు.

ఈ ఫోన్ పేరు 'Tone e20' బోలెడన్నీ ఫీచర్స్‌తో ప్రస్తుత మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది. అయితే, ఇందులో ఉన్న ఓ కీలకమైన ఫీచర్ ఇప్పుడు అందరి దృష్టి ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా నగ్న చిత్రాలు తీసేవారికి ఈ ఫోన్ అస్సలు ఉపయోగపడదు. ఎందుకంటే ఈ ఫోన్ Nude Photo Prevention Systemతో వస్తోంది. ప్రపంచంలో ఈ ఫీచర్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi