Abhisun Jeevinth: టూరిస్ట్ ఫ్యామిలితో డైరెక్టర్‌గా తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు అభిషన్ జీవింత్. తర్వాత ఆయన హీరోగా మారి వెండి తెరపై అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.
ఆయన హీరోగా నటించిన ఫస్ట్ మూవీ 'విత్ లవ్' సినిమా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. టూరిస్ట్ ఫ్యామిలితోనే తెలుగులో అభిమానులను సొంతం చేసుకున్న ఈ దర్శకుడికి.. హీరోగా మారి చేసిన 'విత్ లవ్' తో తెలుగు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన తన కొత్త సినిమా విషయంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న 'డ్రామా కంపెనీ' నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈరోజే ఈ చిత్రం షూటింగ్ అధికారికంగా స్టార్ట్ అయినట్లు ఈ సినిమా నిర్మాణ సంస్థ ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్ చేసింది.
ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివన్న కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. హీరోగా అభిషన్ జీవింత్, హీరోయిన్‌గా శివాని నాగారం, కీలక పాత్రల్లో యోగా లక్ష్మి, గాన వినోత్ నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈచిత్రాన్ని డైరెక్టర్ గౌతమ్ శివరామన్ తెరకెక్కిస్తున్నారు. లియాన్ జేమ్స్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ రోజు షూటింగ్ సెట్ నుంచి రిలీజ్ అయిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థ డ్రామా కంపెనీ తమ ఫస్ట్ ప్రాజెక్ట్‌తోనే బాక్సాఫీస్ వద్ద గట్టి ముద్ర వేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. సినిమా కథ, వైవిధ్యమైన స్టైల్, అందులో ఉండే ట్విస్టులను ప్రస్తుతానికి చిత్రబృందం సీక్రెట్‌గా ఉంచినప్పటికీ… షూటింగ్ లొకేషన్ వైబ్స్ చూస్తుంటే ఇది కచ్చితంగా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ + పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన రోలర్ కోస్టర్ రైడ్ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.
