ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్రపతి ఆహ్వానం అందలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఐతే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
' తెలంగాణ కంటే ఏపీ పెద్ద రాష్ట్రం.. అయినప్పటికీ ఆహ్వానం అందలేదు. అమెరికా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కేసులుండే వ్యక్తులను కలవరు. అది కూడా ఓ అడ్డంకి. కియా మోటార్‌స్ ఇక్కడ పెట్టారు.. కానీ, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడకూడదు అని అగ్రిమెంట్‌లోనే పెట్టారు.

