నందమూరి బాలకృష్ణ భార్య వసుందర కు ఎంత కష్టం వచ్చిందో తెలుసా..ఏంటి కష్టం అనుకుంటున్నారా..ఈ మధ్య కేటుగాళ్లు సినీ నటి నటుల సంతకాలను ఫోర్జరీ చేసి మోసం చేయడం చేస్తున్నారు..తాజాగా వసుందర సంతకాన్ని కూడా అలాగే చేసారు. ఈ పని చేసింది సదరు బ్యాంకు అకౌంటెంట్ కావడం అందరికి షాక్ ను ఇస్తుంది. వివరాల్లోకి వెళ్తే.
జూబ్లీహిల్స్ రోడ్ నం 2లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వసుంధరకు ఖాతా ఉంది. అయితే ఆమె ఇటీవలే మొబైల్ బ్యాంకింగ్ కు దరఖాస్తు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేరింది. దీంతో బ్యాంకు రిలేషన్ షిప్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ ఈ నెల 13న వసుంధరకు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని గురించి వసుంధరను అడగడంతో తాను ఎలాంటి దరఖాస్తు చేయలేదన్నారు.

