Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలకృష్ణ భార్య కు ఎంత కష్టం వచ్చింది..

బాలకృష్ణ భార్య కు ఎంత కష్టం వచ్చింది..

నందమూరి బాలకృష్ణ భార్య వసుందర కు ఎంత కష్టం వచ్చిందో తెలుసా..ఏంటి కష్టం అనుకుంటున్నారా..ఈ మధ్య కేటుగాళ్లు సినీ నటి నటుల సంతకాలను ఫోర్జరీ చేసి మోసం చేయడం చేస్తున్నారు..తాజాగా వసుందర సంతకాన్ని కూడా అలాగే చేసారు. ఈ పని చేసింది సదరు బ్యాంకు అకౌంటెంట్‌ కావడం అందరికి షాక్ ను ఇస్తుంది. వివరాల్లోకి వెళ్తే.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం 2లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వసుంధరకు ఖాతా ఉంది. అయితే ఆమె ఇటీవలే మొబైల్ బ్యాంకింగ్ కు దరఖాస్తు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేరింది. దీంతో బ్యాంకు రిలేషన్ షిప్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ ఈ నెల 13న వసుంధరకు ఫోన్‌ చేశారు. ఈ విషయాన్ని గురించి వసుంధరను అడగడంతో తాను ఎలాంటి దరఖాస్తు చేయలేదన్నారు.

దీంతో ఈ మేరకు వసుంధర తరపున సుబ్బారావు అనే వ్యక్తి బ్యాంక్‌కు వెళ్లి వాకబు చేయగా బ్యాంకులో ఇటీవల కొత్తగా అకౌంటెంట్‌గా చేరిన కొర్రి శివ అనే వ్యక్తి ఈ పని చేసినట్లు బయటపడింది. మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం వసుంధర సంతకాన్ని సేకరించినట్లు అంగీకరించడంతో ఈ మేరకు సుబ్బారావు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ఫై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi