Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Bhagyashri Borse: జాక్‌పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. రామ్ చరణ్ సినిమాలో ఎంట్రీ?

Bhagyashri Borse: 'లెనిన్' సక్సెస్‌తో మంచి జోష్ మీద ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు వరుస అవకాశాలు వస్తాయని అభిమానులు అనుకున్నారు.

అయితే ఇప్పటి వరకు ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే ఇందుకు కారణం ఆమె కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండటమేనని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తొందరపడి వరుస సినిమాలు చేయడం కంటే.. తన పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో పాటు కథలో బలమైన స్థానం ఉన్న ప్రాజెక్టులను మాత్రమే ఎంచుకోవాలని భాగ్యశ్రీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొత్త సినిమాల విషయంలో ఆమె కాస్త సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tollywood Couple: టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట.. అధికారికంగా ప్రకటించిన కాలభైరవ, కావ్య కళ్యాణ్‌రామ్!

ఇదిలా ఉంటే.. భాగ్యశ్రీ బోర్సేకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరో రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా ఆమెను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌కు ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'రంగస్థలం' బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో.. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైతే.. ఆమె కెరీర్‌కు ఇది మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. అయితే రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారనే వార్తపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ఆ ప్రాజెక్ట్‌లో పలువురు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే తాజాగా భాగ్యశ్రీ పేరు వినిపిస్తుండటంతో ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సరసన అసలు హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi