Tuesday, 25 Feb, 8.36 pm తెలుగు మిర్చి

తాజావార్తలు
'బుట్ట బొమ్మ' వచ్చిందో లేదో రికార్డ్స్ మొదలు పెట్టనే పెట్టింది.

అల్లు అర్జున్ - పూజా హగ్దే జంటగా త్రివిక్రమ్ డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా వచ్చినా మూవీ అల వైకుంఠపురం లో. ఈ మూవీ మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్టు అయ్యిందో తెలియంది కాదు. థమన్ అందించిన ప్రతి సాంగ్ యూట్యూబ్ లో సంచలన వ్యూస్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ మూవీ లోని బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ మంగళవారం సాయంత్రం విడుదల చేసారు. ఈ సాంగ్ వచ్చిందో లేదో సంచలన వ్యూస్ సాధిస్తూ వార్తల్లో నిలుస్తుంది.

ఈ పాటను రిలీజ్ చేసిన గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 80 వేలకు మంది పైగా లైక్ చేసారు. అయితే 'సామజవరగమన', 'రాములో రాములా' పాటలకు వచ్చినన్ని వ్యూస్ 'బుట్ట బొమ్మ'కు పాట రాలేదు. కానీ పాటకు మాత్రం బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: telugumirchi
Top