ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్..ఆ తర్వాత ఓ ప్లాప్ డైరెక్టర్ డైరెక్షన్లో సినిమా చేయాలని చూస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనం , ఇష్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విక్రమ్ కె కుమార్..ఆ తర్వాత చేసిన హలో , గ్యాంగ్ లీడర్ చిత్రాలు భారీ ప్లాప్ లు అయ్యాయి.
అయినాగానీ ఇవేమి పట్టించుకోకుండా చరణ్ ఆయనతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. చూపించడమే కాదు ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజున మార్చి 27న అఫీషియల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. మరి మాస్ హీరో అయిన రామ్ చరణ్‌తో క్లాస్ దర్శకుడైన విక్రమ్ కుమార్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.

