Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Dada: సౌరవ్ గంగూలీ బయోపిక్ 'దాదా' ఫస్ట్ లుక్ అవుట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Dada: భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన లెజెండ్రీ కెప్టెన్, ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

గంగూలీ అసాధారణ క్రికెట్ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కుతున్న బయోపిక్ 'దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ' (Dada - The Sourav Ganguly Story) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ రోజు మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో పాటే ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది.

కళ్లు చెదిరేలా లార్డ్స్ ఐకానిక్ మూమెంట్ రీక్రియేషన్
తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ క్రికెట్ ప్రేమికులకు పూనకాలు తెప్పిస్తోంది. 2002లో ఇంగ్లాండ్ గడ్డపై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత.. లండన్ లార్డ్స్ మైదానం బాల్కనీలో సౌరవ్ గంగూలీ తన జెర్సీని గాల్లోకి లేపి ఊపిన ఐకానిక్ సెలబ్రేషన్‌ను ఈ పోస్టర్‌లో రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేశారు. భారత క్రికెట్‌లో అగ్రెసివ్ కెప్టెన్సీకి, కొత్త యుగానికి ప్రతీకగా నిలిచిన ఈ ఐకానిక్ సీన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రం కేవలం ఒక క్రికెటర్ కథ మాత్రమే కాదు.. ఒక తరం మొత్తానికి గెలుపుపై నమ్మకాన్ని నేర్పిన లీడర్ కథ. ఒక సాధారణ యువ క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత టీమిండియాను ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టుగా గంగూలీ ఎలా తీర్చిదిద్దారు? జట్టులో పట్టుదల, పోరాడే తత్వాన్ని ఎలా నూరిపోశారు? అనే అద్భుతమైన విషయాలను డైరెక్టర్ ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారట.

Also Read :Samyuktha Menon: రామ్‌కి జోడిగా విరూపాక్ష బ్యూటీ.. నిజమేనా?

ఈ చిత్రానికి విలక్షణ చిత్రాల డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్, డీబీఎల్, లవ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. సౌరవ్ గంగూలీ బయోపిక్‌ను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా 2027, మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. రాజ్‌కుమార్ రావ్ 'దాదా' లుక్‌కు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీగా పెరిగిపోయాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi