ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న కంటే. దిల్‌రాజు రెండో పెళ్లి వ్యవహారమే హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. అమ్మాయి ఎవరు? దిల్‌రాజుతో ఎప్పటి నుంచి పరిచయం? ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఇదే గ్యాసిప్స్.
ఈమధ్య ఈ పుకార్లు మరింత బలం పుంజుకున్నాయి. దిల్‌రాజు రెండో పెళ్లి రహస్యంగా అయిపోయిందంటూ కథనం వచ్చింది. దాంతో.. సినిమా ఇండ్రస్ట్రీ వాళ్లు షాక్ తిన్నారు. నిజానికి దిల్ రాజు రెండో పెళ్లి ఇంకా జరగలేదు. ఈ పెళ్లి విషయంలో ఇంకా దిల్‌రాజు కుటుంబంలో తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈలోగానే ఆయనకి రెండో పెళ్లి చేసేసారు మీడియా జనాలు.

