Dailyhunt
ఏంటి అమలా రెండో పెళ్లి చేసుకోలేదా..?

ఏంటి అమలా రెండో పెళ్లి చేసుకోలేదా..?

తెలుగు లో పలు సినిమాలతో ఆకట్టుకున్న అమలా పాల్..డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల ఫై ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ..పంజాబీ కుర్రాడు భవీందర్ సింగ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడం..రెండు రోజుల క్రితం వీరిద్దరూ పెళ్లి బట్టల్లో అనిపించడం తో అమలా రెండో పెళ్లి చేసుకుందని అంత ఫిక్స్ అయ్యారు.

ఈ విషయం నిర్ధారణ చేసుకునేందుకు అమలను సంప్రదిస్తే తన మేనేజర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అది తనకు భాగస్వామ్యం ఉన్న కంపెనీ ప్రమోషన్ కోసం చేసిన ఓ క్యాజువల్ ఫోటోషూట్ మాత్రమే అని చెప్పింది. అసలు నేను సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకుంటాను.. కనీసం డిజైనర్ దుస్తులు కూడా ధరించకుండా ఎలా??

అంటూ మీడియాకే ప్రశ్నలు వేసింది. మొత్తం మీద అమలా క్లారిటీ తో అభిమానుల్లో టెన్షన్ తగ్గింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi