Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరోనా ఫై చిరు సాంగ్

కరోనా ఫై చిరు సాంగ్

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది.

చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఛారిటీ కి ఆర్ధిక సాయాన్ని అందజేస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా ఫై అవగాహనా భాగంగా చిరంజీవి ఓ సాంగ్ చేసారు.

కోటి సంగీతం అందించగా..చిరంజీవి , నాగార్జున , సాయి తేజ్ , వరుణ్ తేజ్ ఈ సాంగ్ లో కనిపించారు. మీరు కూడా ఈ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi