Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Karthi: 'సర్దార్ 2' నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా.. కార్తీ

Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన 'సర్దార్ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్.జే.

సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో కార్తీ మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'సర్దార్ 2' తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా అని అన్నారు. ఇలాంటి స్పై పాత్ర తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఫస్ట్ పార్ట్ చేస్తున్నప్పుడే మంచి అనుభూతి కలిగిందని, స్పై ఏజెంట్ల గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయినా వారు తమ పనిని ఎంతో ప్రత్యేకంగా, కచ్చితంగా చేస్తారని తెలిపారు.

'సర్దార్'కు తెలుగులో మంచి ఆదరణ లభించిందని కార్తీ గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఈ సినిమాకు మంచి ఫాలోయింగ్ రావడంతో పలువురు ప్రేక్షకులు పలుమార్లు రీవాచ్ చేశారని చెప్పారు. 'సర్దార్ 2' చూసే ముందు మరోసారి 'సర్దార్' చూస్తే రెండో భాగంతో మరింత బాగా కనెక్ట్ అవుతారని సూచించారు. ఇక యాక్షన్, స్టైలిష్ మేకింగ్ విషయంలో 'సర్దార్ 2' మరో స్థాయిలో ఉంటుందని కార్తీ తెలిపారు. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ స్క్రిప్ట్, సినిమాటోగ్రాఫర్ జార్జ్ విలియమ్స్ కెమెరా వర్క్, సంగీత దర్శకుడు సామ్ సీఎస్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని ప్రశంసించారు. ముఖ్యంగా సామ్ సీఎస్‌కు ఇది 100వ సినిమా కావడం ప్రత్యేకమని, 'ఖైదీ' తర్వాత మరోసారి అద్భుతమైన సంగీతం అందించారని అన్నారు.

Mokshagna Debut: కూన కాదు.. ఇక సింహమే! మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మైత్రీ పవర్‌ఫుల్ అనౌన్స్‌మెంట్..

సినిమాలో మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని కార్తీ చెప్పారు. ఇద్దరూ యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తారని, సినిమాలో వారి 'గర్ల్ పవర్' ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఎస్.జే. సూర్య గురించి మాట్లాడుతూ.. ఆయనకు ఈ సినిమాలో టైలర్ మేడ్ క్యారెక్టర్ దొరికిందని కార్తీ అన్నారు. విలన్‌గా కనిపిస్తూనే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విధంగా ఆయన పాత్ర ఉంటుందని, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా అదరగొట్టే నటుడు ఎస్.జే. సూర్య అని ప్రశంసించారు.

అదే సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీనుతో తనకున్న అనుబంధాన్ని కూడా కార్తీ ప్రస్తావించారు. 'భద్ర' సినిమా తనకు ఎంతో ఇష్టమని, అందులోని ప్రేమ సన్నివేశాలు, రైల్వే స్టేషన్ సీన్ తనకు బాగా నచ్చాయని చెప్పారు. బోయపాటితో ఇప్పటివరకు 'సిట్టింగ్స్' కాదని, కేవలం మీటింగ్స్ మాత్రమే జరిగాయని సరదాగా వ్యాఖ్యానించారు. బోయపాటి క్రమశిక్షణ, పని పట్ల ఆయనకున్న అంకితభావాన్ని కార్తీ ప్రశంసించారు. తన తదుపరి తెలుగు సినిమా గురించి కూడా కార్తీ క్లారిటీ ఇచ్చారు. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 4'లో తాను నటిస్తున్నానని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రతిరోజూ ఎంతో సరదాగా పనిచేస్తున్నామని, ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. అలాగే త్వరలో మరిన్ని తెలుగు సినిమాలు చేస్తానని కార్తీ హామీ ఇచ్చారు. చివరగా 'సర్దార్ 2' కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కార్తీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమ లేకపోతే తాను ఇక్కడ ఉండేవాడిని కాదని, సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో ప్రేక్షకుల స్పందన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi