రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ దంపతులు ఇండియా కు వచ్చిన సంగతి తెలిసిందే. పర్యటన లో భాగంగా ఈరోజు భారత రాష్ట్రపతి ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ విందుకు రాష్ట్రపతి భవన్ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు పిలుపు వచ్చింది. కేసీఆర్ తో పాటు తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ సీఎం కేసీఆర్ తో ముచ్చటించారు. మరి కేసీఆర్ తో ఏం మాట్లాడారో మరి.
డొనాల్డ్ ట్రంప్..

